ఇండియన్ సినిమా దగ్గర తనదైన సినిమాలతో ఎప్పుడో పాన్ ఇండియా సినిమా మార్కెట్ ని పరిచయం చేసిన దర్శకుడు శంకర్ ఇప్పుడు ఫామ్ లో లేని సంగతి తెలిసిందే. తన గత సినిమా గేమ్ ఛేంజర్ అనుకోని డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చింది. దీనితో శంకర్ ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేసారనే టాక్ మొదలైంది. అయితే ఈ సినిమాకి ముందు ఓ చిన్న సినిమా త్వరగా చేస్తారనే రూమర్స్ కూడా వినిపించాయి.
కానీ లేటెస్ట్ గా ఈ సినిమాకో లేక తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసమో కానీ ప్రముఖ స్టార్ హీరో అజిత్ పేరు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. నిజానికి ఇదొక సెన్సేషనల్ కాంబినేషన్ కానీ ఈ కలయిక ఎంత వరకు నిజం అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అజిత్ తన ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తోనే నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే.
