ప్రస్తుతం ఎన్ని పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హీరోస్ లిస్ట్ గాని టాప్ ఇద్దరు హీరోల లిస్ట్ అంటూ మొదలయ్యే చర్చల్లో డెఫినెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల ప్రస్తావనతోనే అదంతా మొదలవుతుంది.
అయితే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల సినిమా మార్కెట్ గాని వారి సినిమాలు వచ్చినపుడు రికార్డుల నంబర్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ అయినా ఫ్యాన్స్ నడుమ వార్స్ అయినా వీరికి వీరే సాటి. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఈ ఇద్దరి హీరోల అభిమానుల కంట్రోల్ లోనే సోషల్ మీడియా అంతా ఉండేది. అయితే వీరి ఫ్యాన్స్ ఏమన్నా బద్ద శత్రువులా అంటే అది కూడా కాదు.
వారిలో వారికి ఎన్ని ఉన్నా మహేష్, పవన్ కలయిక అంటే తమకి ఎప్పుడూ ఇష్టమే.. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవడం జరిగితే అది వారికి చెప్పలేని ఆనందాన్ని పంచుతుంది. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత అదే ఆనందాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇచ్చిన ఒక్క రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇటీవల మహేష్ పుట్టినరోజుకి పవన్ చెప్పిన విషెస్ కి మహేష్ ఇచ్చిన రిప్లై కోసమే రేంజ్ లో సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. పైగా ఇందులో మహేష్ ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ‘మోర్ పవర్ టు యూ’ (నీకు మరింత పవర్ దక్కాలి) అంటూ పెట్టిన లైన్ ముఖ్యంగా ఫ్యాన్స్ లో గట్టిగా కనెక్ట్ అయ్యింది. దీనితో చాలా కాలం తర్వాత మళ్ళీ రెండు ఫ్యాన్డంస్ కలిసిన పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది. ఇలా ప్రస్తుతం మహేష్, పవన్ అభిమానులు మంచి హై లో కొనసాగుతున్నారు.
Thank you so much for the warm wishes… ♥️♥️♥️Much love and more power to u always 🤗🤗🤗
— Mahesh Babu (@urstrulyMahesh) August 9, 2026
