కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగనున్నట్లు ఆయన ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి అయిన గాయానికి వైద్యుల సూచన మేరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ సర్జరీ చేయాలని నిర్ణయించారు.

బుధవారం(రేపు) హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌కు ఈ సర్జరీ జరగనుంది. ఎన్టీఆర్ త్వరగా కోలుకునేలా వైద్య బృందం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్జరీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని ఎన్టీఆర్ ఆఫీస్ సభ్యులు ప్రకటించారు.

ఎన్టీఆర్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వారు పేర్కొన్నారు. ఈ వార్త తెలియడంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Exit mobile version