టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ దిల్‌రాజు, యంగ్ ప్రొడ్యూసర్ ఎస్. నాగవంశీల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో తెరకెక్కిన చిత్రాల నైజాం పంపిణీ హక్కులన్నీ దాదాపు దిల్‌రాజు కే సొంతమయ్యేవి. నాగవంశీ కూడా పలు సందర్భాల్లో దిల్‌రాజు తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు.
అయితే ఏమైందో ఏమో కానీ, నాగవంశీ ఇటీవల వేరే దారి చూసుకున్నారు. తన రాబోయే ప్రాజెక్ట్‌లను అన్నపూర్ణ స్టూడియోస్ లేదా ఇతర పంపిణీదారుల ద్వారా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ విడిపోవడానికి గల అసలు కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా, విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడానికి దిల్‌రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఇటీవల త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ ను కలిసి ఈ చిత్రం కోసం ఫ్యాన్సీ ఆఫర్‌ను అందించారట. హారికా అండ్ హాసిని బ్యానర్ ప్రారంభమైనప్పటి నుండి వారి సినిమాలను నైజాంలో దిల్‌రాజు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా హక్కుల కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ, నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
