సమీక్ష: పాంచాలి పంచ భర్తృక – కొంతవరకే వర్కవుట్ అయ్యే కామెడీ క్రైమ్ డ్రామా

విడుదల తేదీ : ఆగస్టు 14, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : డా.రాజేంద్ర ప్రసాద్, సరీహ్ ఫర్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్ తదితరులు
దర్శకత్వం : గంగ సప్తశిఖర
సంగీతం : మహేష్ నారాయణ, బిషేక్
నిర్మాతలు : వెంకట్ దిగ్గురాజు, రాజ్ పవన్
ఛాయాగ్రహణం : కెవి ప్రసాద్
కూర్పు : జానీ భాష నాగ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, బిగ్‌బాస్ ఫేమ్ రోల్ రైడా మరియు పలువురు నటులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పాంచాలి పంచ భర్తృక’. ‘లెస్ లాజిక్.. మోర్ మ్యాజిక్’ అనే వెరైటీ క్యాప్షన్‌తో వచ్చిన ఈ కామెడీ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

నలుగురు అమాయక స్నేహితులు అనుకోకుండా ఒక విదేశీ అమ్మాయి హత్య కేసులో చిక్కుకుంటారు. ఆ అమ్మాయికి ఒక అండర్‌వరల్డ్ డాన్‌తో లింక్ ఉంటుంది. దాంతో పోలీసులు, మరోవైపు గ్యాంగ్‌స్టర్ల నుంచి తప్పించుకోవడానికి ఈ నలుగురు మిత్రులు పడే పాట్లు ఏంటి? ఆ క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడటానికి వారు చేసిన హంగామా ఏమిటి? ఇందులో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమిటి..? అనేదే ఈ చిత్ర మెయిన్ కథ.

ప్లస్ పాయింట్స్:

తన సీనియారిటీకి తగ్గట్టుగా రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. పలు సన్నివేశాల్లో ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు నవ్వులు పూయిస్తాయి. ఆయన ఉన్నంతసేపు ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు.

రోల్ రైడా, రాజ్ పవన్ మరియు జెమిని సురేష్‌లు తమ పాత్రల మేర బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా రోల్ రైడా ఎనర్జిటిక్ డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల బాగా పేలింది. అతడు చేసే కామెడీ కూడా వర్కవుట్ అయింది.

సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండాఫ్‌లో మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ-క్లైమాక్స్ పోర్షన్ పర్వాలేదనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

‘లెస్ లాజిక్’ అని ముందే చెప్పారు కాబట్టి లాజిక్స్ పక్కన పెట్టినా, కథనంలో ఉండాల్సిన ఇంట్రెస్టింగ్ అంశాలు మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్‌లో సీన్లు చాలా హడావుడిగా సాగుతాయి. కామెడీ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాణమైన కామెడీ పంచ్‌లు కొన్నిచోట్ల పండలేదు.

సెకండాఫ్‌లో డ్రామా పెంచే క్రమంలో అసలు కథ కాస్త ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా కాకుండా ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉండాల్సింది. కథలో చాలా పాత్రలు ఉన్నా, వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయారు.

సాంకేతిక వర్గం:

దర్శకురాలు గంగ సప్త శిఖర ఎంచుకున్న కాన్సెప్ట్ కామెడీకి స్కోప్ ఉన్నా, దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచడంలో కాస్త తడబడ్డారు. కొన్ని సీన్స్‌ను ఆమె ఇంకాస్త బెటర్‌గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. మహేష్ నారాయణ అందించిన ఒకట్రెండు పాటలు ఆకట్టుకుంటాయి. బీజీఎం కూడా అక్కడక్కడా మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉన్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘పాంచాలి పంచ భర్తృక’ చిత్రం కామెడీ డ్రామాగా కొంతవరకే మెప్పిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఎక్స్‌పీరియెన్స్, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ వంటి సీన్లు చిత్రానికి ప్లస్ అయ్యాయి. అయితే, బోరింగ్ స్క్రీన్ ప్లే, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ చిత్రానికి మైనస్. కామెడీ డ్రామాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Exit mobile version