దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. పైగా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి నిజంగా ఆ డేట్ కి రిలీజ్ చేయగలరా ?, నిజానికి ఈ సినిమాలో అందరూ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లే. పైగా ఇప్పుడున్న టాక్ ప్రకారం షూటింగ్ డేట్స్ దాదాపు 90 రోజులకు పైనే అని టాక్. మరి ఈ లెక్కన సంక్రాంతి కానుకగా విడుదల చేయడం సాధ్యమా ?, ఇక ఐదు నెలల సమయం మాత్రమే ఉంది.
ఇంత తక్కువ సమయంలో సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, పాటలు, గ్రాఫిక్స్, ప్రమోషన్స్, సెన్సార్ వంటి పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి తీసుకురావడం అంటే చాలా స్పీడ్ గా వర్క్ జరగాల్సి ఉంది. అసలుకే శ్రీను వైట్ల ప్లాప్ లో ఉన్నాడు. ఈ టైమ్ లో ఇంత స్పీడ్ గా సినిమాని పూర్తి చేసి వదలడం అవసరమా ?, అంతేకాదు.. సంక్రాంతి సినిమాకు ప్రమోషన్స్ కూడా చాలా కీలకం. అందుకే ఐదు నెలల్లో సినిమా పూర్తి చేసే రిస్క్ చేయడం ఎంతవరకు కరెక్టో శ్రీను వైట్లే ఆలోచించుకోవాలి.
