సుమంత్ హీరోగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మేకర్స్ బాగానే కష్టపడ్డారు. ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదు అనిపించుకుంది. ఐతే, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు ఈ చిత్రం సిద్ధమవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ‘ ఈటీవీ విన్ ( ETV Win)’లో ప్రసారం కానుంది. ఈ సినిమా ఆగస్టు 27, 2026న స్ట్రీమింగ్ కానుందని ‘ఈటీవీ విన్’ అధికారికంగా ప్రకటించింది. మరి డిజిటల్ వేదికపై ఈ చిత్రానికి విస్తృత ఆదరణ లభిస్తుందో ? లేదో ? చూడాలి.
కాగా రాజేష్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లో జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల మరియు త్రినాథ్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మరింత మంచి ఫలితాలు వస్తాయనే ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. ఐతే, ఆశించిన స్థాయిలో థియేటర్స్ లో ఈ సినిమా డబ్బు చేసుకోలేదు. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. ఇక నిర్మాత హరీశ్ కొహిర్కర్ ఈ సినిమాని నిర్మించారు.
