టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘పళ్ళబురుసు’ చిత్రంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలోని వినోదం, భావోద్వేగాలు మరియు గుండెను హత్తుకునే కథనం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రానికి ఆయన ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంతేగాక, ఒకే రకమైన యాక్షన్ సినిమాల మధ్య ఇది ఎంతో రిఫ్రెషింగ్‌గా అనిపించిందని.. వెంకీ మహా తర్వాత తనను ఇంప్రెస్ చేసిన దర్శకుడు ఉదయ్ చౌహాన్ అంటూ ఆయన కొనియాడారు.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతాన్ని అందించారు. దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ ఇచ్చిన ఈ రివ్యూ చిత్రబృందానికి పెద్ద బూస్ట్‌గా నిలిచింది.
