నటుడు విశాల్ దర్శకత్వ అరంగేట్రం చేసిన చిత్రం ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దర్శకుడు రవి అరసు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ఒక దర్శకుడిగా మరియు హీరోగా ఈ సినిమా ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.
విడుదలైన మొదటి రోజు నుంచే విమర్శకులు, ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించారు. పాతకాలపు కథనం, రొటీన్ ట్రీట్మెంట్, మితిమీరిన క్లీషేలు ఈ సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేకపోయారు.
నెగెటివ్ రివ్యూలు, పూర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో థియేటర్లకు జనాలు కరువయ్యారు. వీకెండ్ కలెక్షన్లు రూ.2 కోట్ల మార్కును కూడా దాటకపోవడంతో, కనీసం ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కూడా రికవర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
