ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ చిత్రం ‘ధర్మన్’. దీనికి ముందు అంతా ఇపుడు జైలర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు కానీ రీసెంట్ గా రజినీకాంత్ నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు చూసుకుంటే తనకి విలన్ గా చేసిన స్టార్స్ మన టాలీవుడ్ స్టార్లే కావడం గమనార్హం.

ఇప్పుడు చేస్తున్న జైలర్ 2 లో ఎవరు విలన్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ దీనికి ముందు చిత్రాలు ‘కూలీ’, ‘వేట్టైయన్’ సినిమాల్లో మాత్రం తలైవర్ కి ఎదురుగా నిలబడింది తెలుగు హీరోలే కావడం గమనార్హం. వేట్టైయన్ లో ఇంటెన్స్ యాక్టర్ రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తే కూలీ లో కింగ్ నాగార్జున ఆ రోల్ తీసుకున్నారు.

ఇక లేటెస్ట్ గా ధర్మన్ సినిమాలో కూడా యంగ్ హీరో రామ్ పోతినేని రజినీకాంత్ కి విలన్ గా నటిస్తున్నట్టుగా పలు రూమర్స్ మొదలయ్యాయి. సో ఇలా రజినీకాంత్ లాంటి బిగ్ స్టార్ కి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో తెలుగు హీరోలే విలన్లుగా కనిపించడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

Exit mobile version