ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘జన నాయగన్’.. విజయ్ ఆఖరి సినిమా ఎందులో అంటే!

Jana-nayagan

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘జన నాయగన్’. బాలయ్య బంపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమాగా వచ్చింది. ఇక విజయ్ సీఎం గా గెలిచిన తర్వాత తన నుంచి వచ్చిన మొదటి సినిమా ఇది.

ఎన్నో అంచనాలు, అవాంతరాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకోనప్పటికీ 300 కోట్లకి పైగా రాబట్టింది. అయితే ఈ సినిమా ఎట్టకేలకి ఓటిటి రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమాని జీ 5 సొంతం చేసుకోగా అందులో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సినిమాని వారు ఒరిజినల్ తమిళ్ సహా తెలుగు డబ్బింగ్ తదితర భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు చూడని వారు ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ సంస్థ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version