లోకేష్ కనకరాజ్ రికార్డ్.. మొదటి సినిమా తోనే 100 కోట్లు!

తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకుడుగా మాత్రమే కాకుండా హీరోగా కూడా వెండితెరపై అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా తను హీరోగా నటించిన మొదటి సినిమానే “డిసి”. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ సినిమా మూవీ లవర్స్ కి థియేటర్స్ లో సాలిడ్ ట్రీట్ ఇచ్చింది. అయితే ఒక స్లో పాయిజన్ లా ఎక్కేసిన ఈ సినిమా లోకేష్ కనకరాజ్ కి సెన్సేషనల్ డెబ్యూగా నిలిచింది.

ఇప్పుడు అది ఏకంగా 100 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. ఇలా ఇండియన్ సినిమా దగ్గర ఒక దర్శకుడు హీరోగా చేసిన మొదటి సినిమానే 100 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్న రేర్ రికార్డ్ తన సొంతం అయ్యింది. ఇక ఈ భారీ సక్సెస్ లో సంగీత దర్శకుడు అనిరుద్ పాత్ర కూడా చాలానే ఉంది. ఇక ఈ సినిమాలో సంజన, వామికా గబ్బి హీరోయిన్స్ గా నటించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version