కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్ అలాగే నయనతార ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ సినిమానే టాక్సిక్. ఈ ఆగస్ట్ 26న గ్రాండ్ గా విడుదలకి రాబోతున్న ఈ సినిమా తాలూకా తెలుగు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఈ ఈవెంట్ కి ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు హాజరై ఎనర్జిటిక్ స్పీచ్ అందించారు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 నిర్మాత కే వెంకట నారాయణ గారు అని అన్ని భాషల్లో తను సినిమాలు చేస్తున్నారు. రామానాయుడు గారి తర్వాత ఆ ఘనత ఆయనకి మాత్రమే దక్కింది అని తెలిపారు.
ఇక రాకింగ్ స్టార్ యష్ ని తను ఆకాశానికి ఎత్తేసారు. కే జి యఫ్ తర్వాత ఏ సినిమా తీస్తున్నారు అంటే కొత్త దర్శకునితో చేస్తున్నట్టు చెప్పి షాకిచ్చారు అని ఇలా టాక్సిక్ సినిమాతో పాన్ ఇండియా సినిమా కాదు వరల్డ్ సినిమాకి దారి వేస్తూ తన విజన్ చాటి చెప్పారని దిల్ రాజు ఈ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ హైలైట్ గా మారాయి.
