ఇరుముడి : ఒకరికి కమ్‌బ్యాక్.. మరొకరికి తొలి బ్లాక్‌బస్టర్..!

మాస్ మహరాజా లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాతో రవితేజ చాలా రోజుల తర్వాత సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దీంతో మాస్ రాజా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

అయితే, ఈ సినిమాతో తెలుగులో తన తొలి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది అందాల భామ ప్రియ భవానీ శంకర్. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి తమిళంలో బిజీ హీరోయిన్‌గా మారిన ఆమెకు తెలుగులో సరైన విజయం దక్కలేదు. ‘కళ్యాణం కమనీయం’, ‘భీమా’, ‘జీబ్రా’ సినిమాలు ఆమెకు నిరాశ మిగిల్చాయి. నాగచైతన్యతో చేసిన ‘దూత’ వెబ్ సిరీస్ ఓటీటీకే పరిమితమైంది.

దీంతో రవితేజ సరసన వచ్చిన ‘ఇరుముడి’ సినిమాతో ఆమెకు మంచి థియేట్రికల్ విజయం లభించింది. ఈ చిత్రంలో పెళ్లి కాని ప్రియ, ఎలాంటి సంకోచం లేకుండా పదేళ్ల పాపకు తల్లిగా మిడిల్ క్లాస్ మహిళ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఆమెకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది.

Exit mobile version