ఇరుముడి: మూడవ రోజు కూడా భారీ కలెక్షన్స్ !

బలమైన కథాంశం ఉన్న సినిమాను ప్రేక్షకులు అసాధారణ స్థాయికి తీసుకెళ్తారని రవితేజ ‘ఇరుముడి’ మరోసారి నిరూపించింది. ఈ సినిమాలోని భావోద్వేగభరితమైన కథనం ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన కారణంగా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. బుక్‌మైషోలో మూడవ రోజు (ఆదివారం) నాడు ఏకంగా 4 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రెండు విజయవంతమైన రోజుల తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి బలమైన స్పందన లభిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.

ఈ చిత్రం ఇప్పటికే రెండు రోజుల్లో సుమారు రూ. 50 కోట్లు వసూలు చేసింది. బుకింగ్‌లు, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉండటంతో మూడవ రోజు కూడా భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌లలో 25 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సోమవారం బుకింగ్‌లలో కూడా బలమైన డిమాండ్ కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version