మార్ప్ చేశారు, పైగా ట్రోల్ కూడా చేశారు – కంగనా

హీరోయిన్ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఐతే కంగనా రనౌత్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ.. ‘యూత్ ఎక్కువగా సోషల్‌ మీడియాలోనే ఉంటుంది. కానీ, సోషల్ మీడియా అంటేనే నెగిటివిటీ అయిపోయింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫ్ చేస్తూ ఆనందిస్తున్నారు. అంతెందుకు నా ఫోటోలను కూడా మార్ప్ చేశారు. పైగా నన్ను ట్రోల్ చేసి ఆనందించే వారు. ఇలాంటి వారి వల్ల యువకులు కూడా చెడిపోతున్నారు. అందుకే, యూత్ ఆలోచనా విధానం మారాలి’ అంటూ కంగనా తెలిపింది.

కంగనా ఇంకా మాట్లాడుతూ.. ‘వయసులో ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం మంచి వైపు సాగితే జీవితం బాగుంటుంది. లేదు అంటే.. జీవితాంతం బాధ పడాల్సి వస్తోంది. యూత్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా చాలామందికి నచ్చదు. ఈమె నీతులు చెబుతుంది ఏంటి ? అన్నట్టు చూస్తారు. అయినా, నటిగా నా వృత్తికి తగ్గట్లుగా అనేక పాత్రల్లో నటిస్తాను. అవి నేను కాదు, పాత్రలు మాత్రమే’ అంటూ కంగనా కామెంట్స్ చేసింది.

Exit mobile version