లైట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన ‘టాక్సిక్’.. ఎందుకంటే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ చిత్రం ‘డ్రాగన్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉన్న అంచనాలు కోసం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన సాలిడ్ గ్లింప్స్ అదరగొట్టింది.

అయితే ఈ సినిమాకి తాజాగా వచ్చిన మరో భారీ చిత్రం ‘టాక్సిక్’కి ఉన్న చిన్న లింక్ ఒక్కసారిగా థియేటర్స్ లో తారక్ అభిమానులని టెన్షన్ లోకి నెట్టేసింది. డ్రాగన్ గ్లింప్స్ లో కథనం చెబుతూ ఒక డ్రగ్ అది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత టైం లైన్ లో చెప్తారు.

ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే నేపథ్యం సేమ్ డ్రగ్ పేరు చెప్తూ యశ్ ‘టాక్సిక్’లో కూడా ప్రస్తావనకు తీసుకురావడం అనేది ఒకింత షాకింగ్ గా మారింది. దీనితో థియేటర్స్ లో ఈ సీన్స్ చూసి రెండు సినిమాల కాన్సెప్ట్ ఒకటేనా అని ఒకింత టెన్షన్ పడ్డారు. కానీ ఈ పార్ట్ టాక్సిక్ లో చాలా తక్కువ టచ్ చేయడంతో కాస్త ఊపిరి తీసుకున్నారు. దీనితో టాక్సిక్ తో పాటు డ్రాగన్ కూడా ట్రెండింగ్ గా మారింది.

Exit mobile version