పడవ పందెం నేపథ్యంలో సుహాస్, సూరిల ‘మండాడి’.. ఆకట్టుకుంటున్న టీజర్!

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘మండాడి’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

​పడవ పందెం, సముద్ర తీర ప్రాంత కథాంశంతో సాగే ఈ ప్రచార చిత్రంలో ఎస్.ఆర్. కథిర్ అందించిన విజువల్స్, జి.వి. ప్రకాష్ కుమార్ సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ నేతృత్వంలో రూపొందిన యాక్షన్ సన్నివేశాలు టీజర్‌లో కనిపిస్తున్నాయి. మహిమా నంబియార్ కథానాయికగా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

​ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న థియేటర్లలోకి తీసుకురానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మండాడి’ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ సంస్థ విడుదల చేయనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version