‘పంజా’ రీ-రిలీజ్.. కల్ట్ రెస్పాన్స్ లభిస్తుందా..?

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ క్లాసిక్‌గా పేరుగాంచిన ‘పంజా’ చిత్రం 4K వర్షన్‌లో థియేటర్లలోకి రీ-రిలీజ్‌ కానుంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, పవన్‌ కల్ట్‌ ఫ్యాన్స్‌కు మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రమే.

యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ఇక నేటి స్టార్ హీరో అడవి శేష్‌ ఇందులో విలన్‌గా నటించడం విశేషం. ఇటీవలి కాలంలో ‘ఖలేజా’ లాంటి సినిమాలు రీ-రిలీజ్‌లో మంచి ఆదరణ పొందగా, ‘ఖుషి’, ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాలతో పవన్‌ కళ్యాణ్ రీ-రిలీజ్ మార్కెట్‌లో తన సత్తా చాటారు.

మరి ‘పంజా’ 4K రీ-రిలీజ్‌తో ఈసారి థియేటర్లలో పవన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version