‘ఫౌజీ’లో ప్రభాస్‌ను చూసి షాక్ అవ్వాల్సిందే – నిర్మాత రవి శంకర్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొడ్యూసర్ రవిశంకర్, “సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నన్ను అడగండి.. ఇందులో ఒక డిఫరెంట్ ప్రభాస్‌ను చూస్తారు” అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హను రాఘవపూడి విజన్, ప్రభాస్ మేకోవర్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో ఉండబోతున్నాయని నిర్మాత వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version