టాక్.. హిందీలోకి ‘ఇరుముడి’?

ఈ ఏడాది టాలీవుడ్ అందించిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో భారీ లాభాలు పంచిపెడుతున్న చిత్రం ‘ఇరుముడి’ కూడా ఒకటి. మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా బేబీ నక్షత్ర కీలక పాత్రలో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా విజయం ఇండియన్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ లాంటి భారీ సినిమా ఉన్నప్పటికీ ఇరుముడి దానిని బీట్ చేసే బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది.

ప్రస్తుతం 150 కోట్ల గ్రాస్ దగ్గరగా ఉన్న ఈ చిత్రం తెలుగులో ఈజీగా 200 కోట్లకి పైగా వసూళ్లు అందుకోవడం గ్యారెంటీగా మారింది. అయితే ఈ చిత్రం హిందీ డబ్బింగ్ లోకి కూడా వెళ్లే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు టాక్ మొదలైంది. బాలీవుడ్ వర్గాల్లో ఇరుముడి హిందీ డబ్బింగ్ కూడా థియేటర్స్ లో విడుదల కానున్నట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version