కాల భైరవతో రిలేషన్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన ‘బలగం’ బ్యూటీ..!

టాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘బలగం’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కావ్య కళ్యాణ్‌రామ్‌, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవతో తన రిలేషన్‌షిప్‌ను అఫీషియల్‌గా ధృవీకరించింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు ముగింపు పలుకుతూ, కావ్య కాలభైరవతో కలిసి ఉన్న బ్యూటీఫుల్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

తన జీవితంలోకి కాలభైరవ వచ్చిన తర్వాత ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా మారిందంటూ ఒక ఎమోషనల్ నోట్‌ను ఆ పోస్ట్‌కు జోడించింది. కావ్య చేసిన ఈ స్పెషల్ పోస్ట్‌కి సినీ ఇండస్ట్రీలోని సహచరులు, స్నేహితులు మరియు అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరూ తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించడంతో టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ క్రమంలో వీరి ప్రయాణం తర్వాతి దశకు ఎప్పుడు చేరుకుంటుంది, అలాగే త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమైనా వెలువడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version