ఈటీవీలో కొత్త డైలీ సీరియల్ ‘సీతారామయ్య గారి మనవరాలు’ ప్రసారం ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్రీధర్ గూడూరు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సీరియల్, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు టెలికాస్ట్ కానుంది.
కుటుంబ విలువలు, ఆదర్శాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ మనవరాలు తన తాతయ్యను, కుటుంబాన్ని సమస్యల నుంచి ఎలా కాపాడుకుందనే అంశాలను ప్రధానంగా చూపించనున్నారు. ఈ ధారావాహికకు మహేంద్ర వర్మ ఎల్.డి స్క్రీన్‌ప్లే అందించారు.
గతంలో ‘పుత్తడిబొమ్మ’, ‘స్వాతిచినుకులు’ వంటి విజయవంతమైన సీరియల్స్‌ను రూపొందించిన ఆర్కే మలినేని (మలినేని రాధాకృష్ణ) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అధిక సాంకేతిక ప్రమాణాలతో, సుమారు వెయ్యి ఎపిసోడ్ల కథాంశంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు దర్శకుడు పేర్కొన్నారు.
‘స్వాతిచినుకులు’ ఫేమ్ రచిత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శివపార్వతి, పరమేశ్వరి, ప్రశాంత్, అక్షయ, ఆట మౌనిక, హేమంత్, రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్‌కు షకీల్ సంగీతం సమకూర్చగా, ప్రకాష్ కోట్ల సినిమాటోగ్రఫీ, రవి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
