దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో లేటెస్ట్ చిత్రం ‘ఐమ్ గేమ్’ ఇప్పటికే టీజర్, ట్రైలర్స్‌తో ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం 2 గంటల 53 నిమిషాల రన్టైమ్తో రానున్నట్లు తెలుస్తోంది. కొంచెం లెంగ్తీ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను సీటు ఎడ్జ్‌పై కూర్చోబెట్టేలా సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర దుల్కర్ తనదైన మార్క్ హిట్ అందుకుంటాడని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
