అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒకింత బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు చంద్ర మోహన్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి తనకు ఎంతో కలిసొచ్చే కామెడీ జోనర్‌తో అలరించేందుకు సిద్ధమయ్యాడు.
కాగా, ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు ముగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకోవడంతో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతుంది.
సురభి, రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది.
