నాని, కీర్తి సురేశ్ మాస్ మేజిక్: ‘ఏషనాగుల’ సరికొత్త రికార్డ్.. 5 రోజుల్లో 50M+ వ్యూస్!

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న పాటగా చరిత్ర సృష్టించింది.

యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో ట్రెండింగ్ #1
​రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్, శ్యామ్ కాసర్ల రాసిన సాహిత్యం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాంగిరెడ్డి, ప్రభ గానం పాటకు మరింత ఊపు తెచ్చింది. పాటలో నాని, కీర్తి సురేశ్ స్క్రీన్ ప్రెజెన్స్, సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది.

​శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రం 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version