కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన చిత్రాలు కరుప్పు అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్ లతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టి మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల తర్వాత సూర్య తన కెరీర్ 49వ సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి యువ దర్శకుడు రీసెంట్ జన నాయగన్ దర్శకుడు హెచ్ వినోద్ తో సినిమా చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సూర్య సరసన రీసెంట్ సెన్సేషన్ డిసి బ్యూటీ నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్ లో వామికా గబ్బి సూర్య సరసన నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి మరోసారి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్టు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
