డబ్బులు ఇవ్వొద్దు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు: ‘కల్కి 2898 AD’ ఫ్యాన్స్‌ను హెచ్చరించిన మేకర్స్

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రేక్షకులకు, ఆస్పిరింగ్ నటీనటులకు కీలక విజ్ఞప్తి చేసింది. తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ (#Kalki2898AD) పేరుతో జరుగుతున్న నకిలీ కాస్టింగ్ కాల్స్ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

​తమ తరఫున ఆడిషన్స్ లేదా కాస్టింగ్ నిర్వహించడానికి ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీ, కంపెనీ లేదా వ్యక్తులకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. వైజయంతి మూవీస్ ప్రతినిధులమని చెప్పుకుంటూ ఎవరైనా సంప్రదిస్తే నమ్మవద్దని, తమ పేరుతో మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మాణ సంస్థ కోరింది.

​ఎవరైనా సరే తమ వ్యక్తిగత వివరాలు, ఆడిషన్ మెటీరియల్ పంచుకోవద్దని మరియు ఎలాంటి చెల్లింపులు చేయవద్దని హెచ్చరించింది. తమ సంస్థ పేరును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారంతో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం కోసం కేవలం వైజయంతి మూవీస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను మాత్రమే అనుసరించాలని స్పష్టం చేసింది.

Exit mobile version