హీరో కార్తి, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబోలో ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’ సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుండగా, తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకొస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచేసిన ఈ సినిమా విశేషాలను రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్తి పంచుకున్నారు.
సర్దార్ సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వాటర్ బాటిల్ చూస్తే ఆ సినిమానే గుర్తొచ్చింది. సర్దార్ 2 కథ ఎలా ఉండబోతుంది?
ఇండియన్ సినిమాలో స్పై కథలు అరుదుగా వచ్చే తరుణంలో, సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసే సాదాసీదా గూఢచారిగా ‘సర్దార్’ పాత్ర నాకు బాగా నచ్చింది. మొదటి భాగంలో చూపించిన వాటర్ కాన్సెప్ట్ కంటే పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్‌తో, ఎస్.జె. సూర్య పవర్ ఫుల్ విలనిజమ్‌తో ‘సర్దార్ 2’ రాబోతోంది. తమిళం కంటే కూడా ‘సర్దార్’ను తెలుగు ఆడియన్స్ అత్యంత గొప్పగా ఆదరించారు.
సర్దార్ యాక్షన్ ఎలా ఉండబోతోంది?
సాధారణంగా స్పై సినిమాలు విదేశీ ఆపరేషన్ల చుట్టూ తిరిగితే, ‘సర్దార్ 2’ మాత్రం భారతదేశంలోనే జరిగే ఒక ప్రధాన సమస్యను ఒక గూఢచారి ఎలా ఎదుర్కొన్నాడనే ఆసక్తికర పాయింట్‌తో రూపొందింది. విజువల్స్, యాక్షన్ పరంగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు మరింత బాగా కనెక్ట్ అవ్వడానికి, యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న మొదటి భాగాన్ని ఒకసారి చూసి వస్తే బాగుంటుంది.
ఇందులో మీ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
ఈ చిత్రంలో తండ్రీకొడుకుల పాత్రల్లో ఒకేసారి నటించడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ముఖ్యంగా ప్రత్యేక మేకప్ కోసం ఎంతో ఓపిక పట్టాల్సి వచ్చింది. నాకు యాక్షన్ సన్నివేశాలంటే చాలా ఇష్టం. ఒక వృద్ధుడైన, అనుభవజ్ఞుడైన గూఢచారిగా సరికొత్త టెక్నిక్స్‌తో చేసే ఫైట్స్ ఈ సినిమాలో ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.
హీరోయిన్స్ గురించి ?
ఈ సినిమాలో అషిక రంగనాథన్, మాళవిక మోహనన్ సహా ముగ్గురు హీరోయిన్ పాత్రలు చాలా తెలివైనవిగా, దేశం కోసం పోరాడేంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే ఎస్.జే. సూర్య క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ‘స్పైడర్’లో మిస్సయిన మ్యాజిక్ ఇందులో వర్కవుట్ అయిందని సూర్య స్వయంగా చెప్పడమే కాకుండా ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కోసం ఏకంగా ‘వందే భారత్’ ట్రైన్ సెట్‌ను ప్రత్యేకంగా రూపొందించాం.
దర్శకుడు మిత్రన్ గురించి?
డైరెక్టర్ మిత్రన్ చాలా అద్భుతమైన స్కిల్ ఉన్న డైరెక్టర్. తనకి ఆడియన్స్‌కి ఏం కావాలో అలాంటి కాన్సెప్ట్‌ని డిజైన్ చేస్తుంటాడు. ‘సర్దార్ 1’కి ఇప్పటికీ తనలో ఇంకా ఎంతో పరిణితి వచ్చింది.
నెక్స్ట్ సినిమాలు గురించి?
శైలేష్ గారితో ‘హిట్ 4’చేస్తున్నాను. కళ్యాణ్ శంకర్ గారితో చాలా మంచి ఎంటర్టైనర్ చేస్తున్నాను. మంచి ఫన్ సినిమా. అలాంటి సినిమా చేసి చాలా రోజులు అయింది. ‘మార్షల్’ సినిమా 50% షూటింగ్ పూర్తి అయింది.
