మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ గ్రాండ్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి రాబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్‌లతో కూడిన సరికొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకోగా, పవర్, ఫ్యామిలీ, లవ్ మరియు నమ్మకద్రోహం చుట్టూ తిరిగే ఈ కథాంశంపై అంచనాలు భారీగా పెరిగాయి. సాయికిరణ్ రెడ్డి దైడా దర్శకత్వంలో కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుబాటి, సాయికిరణ్ రెడ్డి దైడా ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు కే కే మీనన్ పవర్ఫుల్ విలన్‌గా నటిస్తుండగా, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది.
