షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆత్రేయపురం బ్రదర్స్’

​రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’. శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చివరి షెడ్యూల్ ముగియడంతో యూనిట్ సభ్యులు గుమ్మడికాయ కొట్టారు.

​ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానాంశంగా సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

​S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. సంతు ఓంకార్ సంగీతం అందిస్తుండగా, రమీజ్ నవీత్ సినిమాటోగ్రఫీ, అనిల్ పసల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే చిత్ర ప్రమోషన్లు ప్రారంభించి, విడుదల తేదీని వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.

Exit mobile version