‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. ఐతే, సినిమాలో బన్నీ ఎంట్రీ సీన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ ఎంట్రీ సీన్ పై ఓ న్యూస్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఓపెన్ అవుతుందని.. ఓ భారీ మార్కెట్ లో జరిగిన అలజడి కారణంగా భారీ టెన్షన్ మొదలవుతుందని.. ఒక్కసారిగా విలన్స్ ఎటాక్ చేస్తున్న క్రమంలో, ఒక్కసారిగా సినిమాలో బన్నీ పాత్ర పేరు వినపడుతుందని.. దాంతో సడెన్ గా విలన్స్ లో గుండె భయం మొదలయ్యేలా బిల్డ్ అయ్యేలా సీన్ డిజైన్ చేశారని టాక్.
కాగా ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.
