‘ఎపిక్’ కోసం విజయ్ దేవరకొండ రాక ?

ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం 2026 సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం, విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐతే, ఈ ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ, సెప్టెంబర్ 8న విజయవాడలో జరగనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ హాజరుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ సమయంలో రష్మిక మందన్న తన మరిదికి మద్దతుగా నిలిచినట్లే, విజయ్ రాక కూడా థియేటర్లలో విడుదల కాబోయే ఈ చిత్రానికి మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు. నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేశమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ఈ ‘ఎపిక్’ యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version