RC17 : సుకమార్ లాక్ చేశాడా.. ఇక నెక్స్ట్ అదేనా..?

rc17

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’కి సంబంధించి లాంగ్ వెయిటింగ్‌కు తెరపడే క్షణం వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్‌ను సుకుమార్ పూర్తి చేసి, కథను లాక్ చేసినట్లు తాజా సమాచారం వినిపిస్తోంది.

త్వరలోనే రామ్ చరణ్‌ను కలిసి ఫైనల్ నెరేషన్ వినిపించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నాడట. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా స్క్రిప్టింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ పనుల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

సుకుమార్ ఎంతో జాగ్రత్తగా, సమయం తీసుకుని ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్‌కి ఇచ్చే ఫైనల్ నెరేషన్ పూర్తయిన వెంటనే, చిత్రయూనిట్ ప్రొడక్షన్ షెడ్యూల్స్‌పై దృష్టి పెట్టనుంది. వచ్చే డిసెంబర్ 2026 నాటికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ రచిస్తున్నారు.

Exit mobile version