ట్విస్ట్.. ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ పై కొత్త రూమర్! ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వడ్డీతో కలిపి ఇవ్వనున్న ప్రభాస్?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఈ ఏడాది విడుదలకి ప్లాన్ చేసిన రెండో సినిమా ఫౌజీ కూడా ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 3కి లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇపుడు ఊహించని ట్విస్ట్ ఎదురైనట్టు సినీ వర్గాల్లో రూమర్స్ మొదలయ్యాయి.

దాదాపు ఫౌజీ అనుకున్న సమయానికి రాకపోవచ్చు అనే టాక్ ఇపుడు మొదలైంది. అంతేకాకుండా ఆల్రెడీ ఈ స్లాట్ లో పలు మిడ్ రేంజ్ సినిమాలు కూడా క్యూలో ఉన్నట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఫౌజీ విడుదల ఎప్పుడు? అనే ప్రశ్నకు మరో సమాధానం కూడా వినిపిస్తోంది. మేకర్స్ ఈ సినిమాని కేవలం ఒక్క నెల వెనక్కి జరపనున్నట్టు బజ్ వినిపిస్తోంది.

అంటే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనున్నటు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన రాజా సాబ్ తో మిగిలిన డిజప్పాయింట్ కి వడ్డీతో కలిపి ఫౌజీ తో ప్రభాస్ తిరిగి ఇవ్వనున్నాడని చెప్పొచ్చు. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version