తన కెరీర్ మొదట్లోనే సాలిడ్ హిట్స్ అందుకున్న టాలెంటెడ్ దర్శకుల్లో ప్రముఖ దర్శకుడు పరశురాం పెట్ల కూడా ఒకరు. అయితే సర్కారు వారి పాట నుంచి గాడి తప్పిన తాను ఫ్యామిలీ స్టార్ తో కూడా మెప్పించలేకపోయారు. ఇక ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న తను నెక్స్ట్ సినిమాగా ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తన తదుపరి సినిమా కోసం ఓ బిగ్ బడ్జెట్ కావాల్సిన ప్రాజెక్ట్ ని తను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రొజెక్టుని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ తో చేయనున్నట్టు టాక్. హను మాన్ సినిమాతో సంచలన హిట్ కొట్టిన తాము, ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సంబరాల ఏటి గట్టు అనే బిగ్ బడ్జెట్ సినిమా చేస్తున్నారు.
ఇక ఆ సినిమా తర్వాత పరశురాం తో కూడా గ్రాండ్ స్కేల్ సినిమానే అంటున్నారు కాబట్టి అది ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇక ఈ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
