మెగా యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం సంబరాల ఏటి గట్టు కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రోహిత్ కెపి తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది, కానీ ఈ చిత్రం పలు కారణాలు చేత ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఫైనల్ గా ఈ రానున్న సంక్రాంతి రేస్ లో విడుదల ఖరారు చేసుకుంది.
ఇక ఈ సినిమాకి ఫైనల్ వర్క్స్ స్టార్ట్ చేసినట్టుగా సాయి తేజ్ తెలిపాడు. నిన్నటి నుంచే సినిమా డబ్బింగ్ ని మొదలు పెట్టినట్టుగా డబ్బింగ్ స్టూడియో నుంచి పూజా కార్యక్రమాలు వీడియో షేర్ చేసి రివీల్ చేసాడు. దీనితో ఈసారి సినిమా రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య లేక్ష్మి నటించింది. అలాగే అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హను మాన్ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మాణం వహించారు.
Dubbing Begins 🙏🏼#SYGOnJan12th pic.twitter.com/JiblARWtaE
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 11, 2026
