‘ఎపిక్’ సినిమా కోసం కదిలిన దేవరకొండ ఫ్యామిలీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘ఎపిక్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ తిలకించారు. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు దేవరకొండ ఫ్యామిలీతో పాటు ‘ఎపిక్’ చిత్ర బృందం కూడా హాజరైంది.

ఇరు కుటుంబాల సభ్యులు కలిసి సినిమాను వీక్షించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, అభిమానులు ‘ఎపిక్ బ్లాక్‌బస్టర్’ అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాను ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేయగా నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version