వారు సినిమా రిలీజ్‌కు ముందే సక్సెస్ అని చెప్పారు – సూరి

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించి, సమర్పించిన చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా సెప్టెంబర్ 10న విడుదలై మంచి విజయం సాధించిన సందర్భంగా శనివారం ‘యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్’ నిర్వహించారు.

ఈ వేడుకలో నటుడు సూరి మాట్లాడుతూ.. ‘మండాడి’ని తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మైత్రి నవీన్, రవిగార్లు విడుదలకంటే ముందే సినిమా చూసి విజయాన్ని ఖాయం చేశారని గుర్తుచేసుకున్నారు. తనకు మద్దతుగా నిలిచిన దర్శకుడు మదిమారన్, నిర్మాత ఎల్రెడ్, కో-స్టార్ సుహాస్ మరియు మైత్రి సంస్థ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version