‘ఇరుముడి’ సంచలన విజయం.. రవితేజ అండ్ టీం ని కలిసిన కలిసి చిరు, చరణ్!

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లేటెస్ట్ సంచలన హిట్ చిత్రమే ‘ఇరుముడి’. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చి అంతకు మించిన అంచనాలు అందుకొని తెలుగు సినిమా దగ్గర భారీ విజయాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ఇక ఈ సినిమా విడుదల అయ్యాక సినీ ప్రముఖులు నుంచి కూడా అనేక ప్రశంసలు కూడా అందాయి. అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి రవితేజ మరియు దర్శక, నిర్మాతలను కలిసి తమ అభినందనలు తెలిపారు.

దీనితో మైత్రి మూవీ మేకర్స్ ఆ ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకొని తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. దీనితో ఈ పిక్స్ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా బేబీ నక్షత్ర ముఖ్య పాత్ర నటించింది.

Exit mobile version