లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధానపాత్రలో రానున్న సినిమా ‘మూకుత్తి అమ్మన్ 2’. ఈ సినిమా తెలుగులో ‘మహాశక్తి’గా రాబోతుంది. సీనియర్ దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లో విజువల్స్ అండ్ మిగిలిన క్యారెక్టర్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు.
అలాగే, అమ్మవారి పాత్రలో నయనతార గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సునీల్, అలాగే ప్రతినాయక పాత్రలో రెజీనా, దునియా విజయ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవని సినిమాక్స్, రౌడీ పిక్చర్స్ మరియు ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళా ఆది సంగీతం అందిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
