‘అనకాపల్లి’ విడుదల తేదీ ఖరారు.. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు

Anakapalli Set to Release on October 2

ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ పతాకాలపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా విడుదల తేదీ పోస్టర్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది.

ఈ సినిమాలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు పోషించగా, నిర్మాతలు కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన కూడా నటించారు. చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించగా, ఉదయ్ భాగవతుల సంభాషణలు రాశారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాయి.

గత ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని అనకాపల్లి స్థానికులకు ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి దేవ్ జండ్ సంగీతం అందించగా, మాయా.వి సినిమాటోగ్రఫీ, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

Exit mobile version