‘డేవిడ్ రెడ్డి’ నుంచి రమ్యకృష్ణ పవర్ఫుల్ లుక్.. మరో శివగామి అవుతుందా!

మంచు వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హనుమా రెడ్డి ఎక్కంటి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ కూడా ఒకటి. ఇది వరకే వచ్చిన పోస్టర్ లు, టీజర్ లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు పవర్ఫుల్ నటి రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ చెబుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు.

డేవిడ్ రెడ్డి ప్రపంచంలోకి శివగామి వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఈ పోస్టర్ కనిపిస్తుంది. రమ్యకృష్ణ ఇంటెన్స్ లుక్ కటానా పట్టుకొని కుర్చీలో కూర్చొని ఉన్నా ఈ పోస్టర్ తో ఆమె కమలా రెడ్డి అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలిపారు. మరి పెర్ఫామెన్స్, పాత్ర కూడా శివగామి రేంజ్ లోనే ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే భరత్ మోతుకూరి, నల్లగంగుల వెంకట రెడ్డిలు నిర్మాణం వహించారు. అతి త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

Exit mobile version