వాయిదా పడ్డ ప్రశాంత్ నీల్ హారర్ మూవీ ‘418’.. కారణం ఏమిటంటే..?

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, ప్రశాంత్ నీల్ సమర్పణలో వస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418 ది మూవీ’ విడుదల వాయిదా పడింది. ముందుగా అనుకున్న తేదీకి కాకుండా ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

దక్షిణాది భాషలతో పాటు ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇటీవల ఉత్తరాదికి చెందిన పలువురు ఎగ్జిబిటర్లు ఈ సినిమాను చూసి ప్రశంసించడమే కాకుండా, హిందీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపించారు. ఆల్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి మరింత సమయం పడుతుందని, అందుకే విడుదలను వాయిదా వేస్తున్నామని తెలిపారు.

హిందీ మార్కెట్‌లో మంచి హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే ఆలోచనతో నిర్మాతలు సరైన దిశగానే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ హారర్ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.

Exit mobile version