ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వారణాసి కోసం అందరికీ తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో వదిలిన ఒకే ఒక్క మోషన్ పోస్టర్ గ్లింప్స్ పాన్ వరల్డ్ లెవెల్లో ఇప్పటికీ సినిమాపై హైప్ ని అలా ఉంచి రూల్ చేస్తుంది.
అయితే అప్పటి నుంచి ఇప్పటికి కేవలం కొన్ని స్టిల్స్ మాత్రమే బయటకి వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ సరిగ్గా ఏడాది తర్వాత వారణాసి టీం మరో భారీ ఈవెంట్ తో బిగ్ రివీల్ తో రాబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అయితే గత ఏడాది హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే ఈసారి ఉత్తర భారదేశంలో గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
సో అది నవంబర్ లోనేనా లేక డిసెంబర్ లోనా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ అక్టోబర్ కి షూట్ అంతా కంప్లీట్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. సో ఆ తర్వాత నుంచి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్ ని జక్కన్న ముమ్మురం చేయడం గ్యారెంటీ.
