యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ పూర్తి స్థాయి యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు 175 రోజుల పాటు సాగిన సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసినట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.
ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకంగా మారాయని నిఖిల్ తెలిపాడు. చిత్రంలో సుమారు 2,700 కు పైగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయని, నేటి ప్రేక్షకులు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నందున ఏ మాత్రం లోపాలు లేకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ గ్రాఫిక్స్ పనులను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
