ఫ్యాన్సీ రేటుకు ‘దాదా’ నాన్-థియేట్రికల్ రైట్స్.. సొంతం చేసుకుంది ఎవరంటే..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ షూటింగ్ సమయంలో ఆయనకు గాయం కావడంతో శస్త్రచికిత్స జరిగింది. అయితే పూర్తిగా కోలుకున్న ఆయన, అక్టోబర్ మొదటి వారంలో సినిమా షూటింగ్‌లో తిరిగి పాల్గొననున్నారు.

బాలకృష్ణ లేని సన్నివేశాలను దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పటికే పూర్తి చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. అయితే, ఈ భారీ చిత్రానికి సంబంధించి నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. జీ స్టూడియోస్ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ మరియు మ్యూజిక్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుందట. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది అత్యంత హైయెస్ట్ నాన్-థియేట్రికల్ బిజినెస్ కావడం విశేషం.

‘పెద్ది’ నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Exit mobile version