‘కల్ట్’ రిలీజ్ డేట్ లాక్ చేసిన విశ్వక్ సేన్..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ స్లాషర్ థ్రిల్లర్ ‘కల్ట్’. గతంలో విడుదలైన టీజర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యాయి. ఒక ప్రైవేట్ పార్టీలో జరిగే అత్యంత ప్రమాదకరమైన గేమ్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అందులో ఓడిపోయిన వారిని ఎంత దారుణంగా హత్య చేస్తారనేది ఈ సినిమా ముఖ్యాంశం.

సీటు అంచున కూర్చోబెట్టేలా, రక్తపాతంతో కూడిన పూర్తిస్థాయి ‘స్లాషర్’ జోనర్‌లో భారతదేశంలోనే వస్తున్న తొలి చిత్రంగా ‘కల్ట్’ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన యాక్షన్ ప్రోమోతో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. రాబోయే అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రోమోలో విశ్వక్ సేన్ విలన్లను క్రూరంగా నరికిపారేస్తూ తన మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారు.

తారక్ పొన్నప్ప, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘తారక్ సినిమాస్’, ‘వన్మయి క్రియేషన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఊరమాస్ ప్రాజెక్ట్‌కి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version