‘జైలర్ 2’ నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే ‘జైలర్ 2’. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఒకో అప్డేట్ ని రివీల్ చేస్తూ వస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని కీలక పాత్రలని కూడా పరిచయం చేస్తూ వచ్చారు. ఇక వీటి తర్వాత రెండో సాంగ్ పై మేకర్స్ ఇపుడు అప్డేట్ అందించారు. ఈ సాంగ్ ఏంటి? ఎప్పుడు వస్తుంది అనేవి రేపు సెప్టెంబర్ 23న అనౌన్స్ చేస్తున్నట్టు తెలిపారు.

సో ఈసారి అనిరుద్ ఎలాంటి సాంగ్ ని తలైవర్ కోసం డిజైన్ చేసాడో చూడాలి. ఇక ఈ సినిమాలో విద్యా బాలన్, ఎస్ జే సూర్య, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మరింతమంది స్టార్స్ నటించారు. అలాగే ఈ అక్టోబర్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నారు.

Exit mobile version