లేటెస్ట్: మళ్ళీ వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం’.. కొత్త డేట్ ఇదే!

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఎంటర్టైనర్ డ్రామా విషయంలో గత కొన్ని రోజులు నుంచి వాయిదా కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తూ వచ్చింది.

మేకర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి విడుదల తేదీ అక్టోబర్ 9కి వస్తున్నట్టు ముందే సమాచారం అందించారని వినిపించింది. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. దీనితో ఈ అక్టోబర్ 9నే విడుదల చేస్తున్నట్టుగా కొత్త పోస్టర్ తో తెలిపారు. సో అక్టోబర్ 2 నుంచి మరో వారానికి సినిమా వాయిదా పడింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version